ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి నిన్ననే బన్ను బర్త్ డే కానుకగా అయితే ఓ రేంజ్ లో ట్రీట్ ఇచ్చే టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాని ఇది వరకే వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తామని ఆ మధ్య బన్నీ స్వయంగా తెలిపాడు. మరి మరి ఈ భాషల్లో అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ చైనా లో కూడా గ్యారెంటీ గా ఉంటుంది అని తెలుస్తుంది.
అయితే నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో కూడా పుష్ప చైనా లో కూడా ఉన్నాడా అనే హింట్ తో పాటుగా సరిగ్గా చూస్తే పుష్ప టైటిల్ కార్డు లో కూడా చైనా రిలేటెడ్ గా మెయిన్ హైలైట్ కనిపిస్తుంది. 2 అనే నెంబర్ లో మొత్తం చైనా డ్రాగన్ తరహా పచ్చ రంగు డిజైన్ పైగా కింద ది రూల్ అనేది కూడా చైనీస్ అక్షరాల స్టయిల్ లోనే కనిపిస్తుంది.
దీనితో కొంతమందికి వచ్చిన డౌట్స్ అన్నీ నిజమే అని చెప్పాలి. దీనితో పుష్ప ఈసారి చైనా మార్కెట్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అంతే కాకుండా పుష్ప 1 లో కూడా ఎర్ర చందనం కి చైనా జపాన్ లో భారీ డిమాండ్ ఉంటుంది అని చూపించారు. ఈ కనెక్షన్ తో కూడా చైనా మార్కెట్ లో పుష్ప కి గట్టి ఛాన్స్ ఉంటుంది అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే పుష్ప 2 ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.
