అతనితో డేటింగ్ అభ్యంతరం లేదంటున్న ప్రజ్ఞ జైస్వాల్.. పాప కోరిక పెద్దదే అంటున్న నెటిజన్స్!

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటి ప్రజ్ఞా జైస్వాల్ కి ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ని మిగిల్చింది. ఆ తర్వాత వచ్చిన కంచె సినిమాతో టాలీవుడ్ దృష్టి ఆమెపై పడింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ ఎందుకో అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయింది ఈ నటి. లేటెస్ట్ గా ఈమె ఫిల్మీ జ్ఞాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ క్రికెటర్ శుబ్ మాన్ గిల్ తో డేటింగ్ చేయడం తనకేమీ అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.

గతంలో శుబ్ మాన్ గిల్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ ఆ జంట ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతూ ఉండేది. ఇక ఇప్పుడు ప్రజ్ఞ జస్వాల్ కామెంట్స్ ఆ జంటపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. అమ్మడి ఆసలు పెద్దవే అంటూ ప్రజ్ఞ జైశ్వాల్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక ప్రజ్ఞా జైస్వాల్ సినిమాల విషయానికి వస్తే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా అందాల ఆరబోతతోనే వైరల్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫొటోస్ తో అభిమానులని హీటెక్కిస్తోంది ఈ భామ. అయినా ఎందుకో అనుకున్నంతగా సినిమా అవకాశాలు రావడం లేదు ఈమెకి.

తెలుగులో అఖండ సినిమా లో బాలకృష్ణకి జంటగా నటించింది ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయినప్పటికీ ఎందుకో ఈ భామకి మాత్రం అవకాశాలు పెద్దగా రాలేదు. నిజానికి అఖండ సినిమా అందుకున్న విజయం చూసే ప్రజ్ఞ జైస్వాల్ కి మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ భావించారు కానీ అలా జరగలేదు. డేగ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగుతోపాటు హిందీ తమిళ భాషలలో కూడా నటించింది.