Prabhas : గాయం కారణంగా సలార్ కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్….!

Prabhas: వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఒక మంచి హిట్ కొట్టేయాలని ఆలోచిస్తున్నారు . రాధేశ్యాం సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అభిమానులు అంతా సలార్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మిగతా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాని మొదట గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని అందరూ భావించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం కాబట్టి దీని మీద అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

అయితే ఈ సినిమా అనుకున్న సమయం కంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. `రాధేశ్యామ్`సినిమా ప్రమోషన్స్ కోసం `సలార్`సినిమా షూటింగ్ కి ప్రభాస్ బ్రేకిచ్చారు.అయితే ఈ మధ్య సలార్ షూటింగ్ లో జరిగిన ప్రమాదం కారణంగా ప్రభాస్ భుజానికి అయిన గాయం మళ్లీ తిరగతోడటం.. ఇంకా ఆ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు ఆపరేషన్ తప్పనిసరి అని సూచించడంతో ప్రభాస్ మైనర్ సర్జరీ కోసం `రాధేశ్యామ్` రిలీజ్ తరవాత స్పెయిన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.ఇక ఇటీవలే సర్జరీ పూర్తయింది.ప్రస్తుతం డాక్టర్ ల సలహా ప్రకారం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇప్పటివరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేసుకుంది సలార్ సినిమా. అయితే ప్రభాస్ విశ్రాంతి తర్వాత సినిమా షూటింగులో పాల్గొనడానికి దాదాపు రెండు నెలల సమయమైనా పడుతుందట.దీంతో `సలార్` సినిమా షూటింగ్ ఆలస్యం కానుందని ఈ కారణంగా సినిమా విడుదల కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ ఏడాది చివరకు కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయట. సలార్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు.