టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అన్ని చిత్రాల్లో ఎప్పుడో స్టార్ట్ చేసిన తన మొదటి పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.
పైగా పవన్ కూడా మొదటి సారి ఓ వారియర్ రోల్ చేస్తుండగా ఫ్యాన్స్ కూడా బాగా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత పవన్ నుంచి ఏకంగా రెండు సినిమాలు రిలీజ్ కి వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సూపర్ స్పీడ్ లో కంప్లీట్ కూడా అయిపోతున్నాయి.
కానీ “హరిహర వీరమల్లు” మాత్రం ఇంకా చాలా బాలన్స్ ఉండిపోయింది. అయితే ఇప్పటికే బాగా లేట్ అంటే పవన్ మరో సినిమా ఓకే చేసాడు అంటూ కొన్ని షాకింగ్ రూమర్స్ ఇప్పుడు బయటకి వచ్చాయి. మరి అది కూడా ఈసారి తమిళ దర్శకుడు లోకేష్ కనక రాజ్ తో అట.
ఇది వినడానికి బాగానే ఉంది కానీ ముందు పెండింగ్ ఉన్న సినిమాలు ఎన్ని? అసలు దిక్కు లేకుండా పోయిన హరిహర వీరమల్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి ఈ లోపల మళ్ళీ పవన్ గాని కొత్త సబ్జెక్టు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే పవన్ ఇంకా ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వలేదు అట. లోకేష్ కనక రాజ్ తో అయితే అసలే లేదని సినీ వర్గాలు ఇపుడు కన్ఫర్మ్ చేసాయి.
