బాబాయ్ బాలకృష్ణకీ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్‌కీ మధ్య గ్యాప్ పెరిగింది. ఎవరి వల్ల.? అన్నది పక్కన పెడితే, గ్యాప్ అయితే ఏర్పడింది. ఒక్క అబ్బాయ్‌కే కాదు.. ఇద్దరు అబ్బాయిలకీ, బాబాయితో గ్యాప్ పెరిగిన మాట వాస్తవం.
ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు తెరవెనుక గట్టిగా జరుగుతున్నాయట. దీనికి నందమూరి కళ్యాణ్ రామ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
కళ్యాణ్‌రామ్ కొత్త సినిమాకి సంబంధించి.. జూనియర్ ఎన్టీయార్, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించేలా తెరవెనుక మంత్రాంగం గట్టిగా జరుగుతోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.
ఇప్పటికిప్పుడు సినిమా ఈవెంట్‌కి అవకాశం లేకపోయినా, ‘స్పేస్’ అయితే తీసుకుని మరీ, బాబాయ్ – అబ్బాయ్ మధ్య గ్యాప్ తగ్గించే కార్యక్రమం చేపడుతున్నారట. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.