గత ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా రిలీజ్ కి చాలా చిత్రాలు రాగా వాటిలో మంచి సక్సెస్ లు కూడా ఉన్నాయి. కాగా ఈ లిస్ట్ లో అయితే తన మొదటి ప్రయత్నంలోనే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సూపర్ గా సక్సెస్ అయ్యాడు. తన “కార్తికేయ 2” ని హిందీ లో రిలీజ్ చేసి దాదాపు 33 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టాడు.
దీనితో నిఖిల్ మంచి కంటెంట్ తో వస్తే తన సినిమా కూడా నార్త్ లో ఆడుతుంది ప్రూవ్ చేసాడు. ఇక నెక్స్ట్ చేసిన 18 పేజెస్ సినిమాని రిలీజ్ చేయలేదు కానీ తాను అయితే మరో సినిమాని పాన్ ఇండియా రిలీజ్ అనౌన్స్ చేసాడు. మరి గ్యారీ బి హెచ్ దర్శకత్వం వహించిన సినిమానే “స్పై”.
అయితే ఈ తరహా సినిమాలకి మంచి మార్కెట్ ఉంది కానీ ఇందులో ఇండియన్ ఆడియెన్స్ కి మెయిన్ గా నార్త్ ఆడియెన్స్ కి బాగా నచ్చే ఎలిమెంట్ ని ఇప్పుడు రివీల్ చేసారు. ఇండియన్ హిస్టరీ లో ఇప్పటికీ సీక్రెట్ గా ఉన్న దేశ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పై ఈ సినిమా ఉండనున్నట్టుగా అనౌన్స్ చేసారు.
దీనితో అప్పుడు కృష్ణ భగవానునితో ఎలా అయితే సినిమా చేసి మంచి అటెన్షన్ ని హిందీ మార్కెట్ లో పట్టారో ఇప్పుడు ఇదే రీతిలో సుభాష్ చంద్రబోస్ కాన్సెప్ట్ తో అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్పక తప్పదు. ఇది డెఫినెట్ గా హిందీ మార్కెట్ లో ఆడియెన్స్ చూసేలా చేస్తుంది.
అయితే ఇదే అనౌన్సమెంట్ లో ఈ చిత్రాన్ని జూలై 29న గ్రాండ్ గా రిలీస్ చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేసి అసలు బిగ్ అప్డేట్ అందించారు. మరి ఈ జూలై 29న నిఖిల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేదా చూడాలి.
https://twitter.com/actor_Nikhil/status/1654799866642731009