‘ఆహా’ని తిట్టుకుంటున్న నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ నోట నర్సులపై రాకూడని మాటలే వచ్చేశాయి. నాలుగ్గోడల మధ్య ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే.. పిచ్చాపాటీగా ఇంకెక్కడైనా అలా మాట్లాడుకుంటే.. అది తప్పు కాకపోవచ్చు. కానీ, బాలకృష్ణ ఓ ఎమ్మెల్యే. ఆయన ప్రముఖ సినీ నటుడు.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో టాక్ షో సందర్భంగా హోస్ట్ నందమూరి బాలకృష్ణ నర్సుల విషయమై నోరు జారారు. దాంతో, ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు.

క్షమాపణతో వివాదం సద్దుమణుగుతుందా.? అంటే, సోషల్ మీడియా ద్వారా చెబితే కుదరదు.. తమకు బహిరంగ క్షమాపణ కావాలంటున్నారు కొందరు నర్సులు. మరి, బాలయ్య ఏం చేస్తోడో.?

నిజానికి, ఇలాంటి మాటలు దొర్లినప్పుడు ‘ఆహా’ టీమ్ ఎడిటింగ్‌లో ఆ మాటల్ని లేపేసి వుండాలి. కానీ, అలా చేయలేదు ‘ఆహా’ టీమ్. ఈ వివాదం మొత్తానికి ‘ఆహా’ టీమ్ కారణమంటూ నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. బాలయ్య కూడా అదే కోణంలో గుస్సా అవుతున్నాడట.