మెగా వర్సెస్ అల్లు: ఈ వైరానికి సుకుమార్ ‘చెక్’ పెట్టబోతున్నాడా.?

మెగా – అల్లు కాంపౌండ్ మధ్య ఏదో జరుగుతోందనీ, ఈ రెండు కాంపౌండ్స్ పూర్తిగా వేరు పడ్డాయనీ ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదంటూ పెద్ద తలకాయలు చిరంజీవి, అల్లు అరవింద్ ఎంత చెబుతున్నా, ఈ రూమర్లకు చెక్ పడడం లేదు. అయితే, ఈ రూమర్లకు చెక్ పడే అవకాశం కల్పించబోతున్నాడు ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్. అదేంటీ.? సుకుమార్‌కి ఏం సంబంధం.. అంటారా.?

‘పుష్ప ది రూల్’ సినిమాలో రామ్ చరణ్‌తో ఓ గెస్ట్ రోల్ చేయించాలనే ఆలోచనతో వున్నాడట దర్శకుడు సుకుమార్. తద్వారా మెగా – అల్లు అభిమానుల మధ్య వున్న అభిప్రాయ బేధాల్ని తగ్గించే ప్రయత్నం చేయాలన్నది సుకుమార్ ఆలోచన అని సమాచారం. అంతేకాదు, ఈ ఐడియా అల్లు అర్జున్ స్వయంగా ఇచ్చాడని అంటున్నారు. ‘పుష్ప ది రైజ్’ అంటూ మొదటి పార్ట్‌తో అల్లు అర్జున్ తిరుగులేని హిట్ కొట్టాడు.

బన్నీ మామూలోడు కాదు సుమీ.! ‘పుష్ప 2’కి అంతకు మించి బజ్ రాబట్టాలంటే ఇలాంటి మాస్టర్ ప్లాన్ ఏదో చేయాల్సిందే. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్న మాట. అటు ఫ్యామిలీ మ్యాటర్, ఇటు తన కెరీర్ మ్యాటర్.. రెండూ వర్కవుట్ అయ్యేలా ప్లాన్ చేశాడటన్న మాట. అన్నట్లు, గతంలో చరణ్ – అల్లు అర్జున్ ‘ఎవడు’ సినిమాలో నటించారు.