మాసివ్ అనౌన్సమెంట్ : రిలీజ్ డేట్ తో “టాక్సిక్” గా యష్ నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ 

సౌత్ ఇండియా సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ని సంతరించుకున్న ప్రెజెంట్ జెనరేషన్ స్టార్ హీరోస్ లో కన్నడ రాకింగ్ స్టార్ నటుడు యష్ కూడా ఒకడు. మరి తన అదృష్టమో ఏమో కానీ కేజీఎఫ్ సినిమాలతో సెన్సేషనల్ గా మారిన యష్ ఇప్పుడు తన కెరీర్ లో 19వ సినిమా ఎప్పుడు అనేది ఇప్పుడు లాక్ చేసాడు.

గత కొంతకాలంగా ఉన్న రూమర్స్ తోనే ఓ లేడీ డైరెక్టర్ ఈ బిగ్ ప్రాజెక్ట్ ని చేస్తుండగా ఇప్పుడు మేకర్స్ చెప్పినట్టుగా ఆ మాసివ్ అనౌన్సమెంట్ ఒకటి కాదు రెండు అందించారు. మొదటగా ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ తో సినిమా టైటిల్ ని “టాక్సిక్” అంటూ రివీల్ చేయగా దీనికే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు.

మరి ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ పై కూడా బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వడం ట్విస్ట్ గా మారింది. మరి ఇందులోనే మేకర్స్ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది చెప్తూ రానున్న 2025 లో ఏప్రిల్ 10న బ్రహ్మాండమైన విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఇది మాత్రం ఊహించని అప్డేట్ అని చెప్పాలి.

అయితే ఈ టీజర్ బట్టి చూస్తే ఇది ఏదో ఓ గ్యాంబ్లింగ్ అండ్ మైండ్ గేమ్ సినిమాలా అనిపిస్తుంది. అంతేకాకుండా యష్ అదే గడ్డం లుక్ లో ఉన్నాడు కానీ తన గెటప్ మాత్రం కంప్లీట్ గా ఈ సినిమాకి మార్చినట్టుగా టీజర్ చూస్తే అనిపిస్తుంది. వీటితో అయితే కేజీఎఫ్ 2 తర్వాత ఆ అంచనాలు యష్ మ్యాచ్ చేసేలానే ఉన్నాడని అనిపిస్తుంది. మరి ఇంకా సినిమా సంగీతం ఎవరు? హీరోయిన్ ఇతర నటులు వివరాలు ఏవి మేకర్స్ రివీల్ చేయలేదు. 
TOXIC - Rocking Star Yash | Geetu Mohandas | KVN Productions | Monster Mind Creations