Gallery

Home News ఈ క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశా .. మంచు లక్ష్మీ..!

ఈ క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశా .. మంచు లక్ష్మీ..!

మంచు ఫ్యామిలీలో హీరోలే కాదు హీరోయిన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. గుండెల్లో గోదారి లాంటి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన మంచు లక్ష్మీ సిద్దార్థ్ – శృతి హాసన్ నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దొంగల ముఠా, ఊ..కొడతారా ఉలిక్కిపడతారా, w/o రామ్‌, మా వింత గాధ వినుమా, లాంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కడలి.. అలాగే హిందీలో డిపార్ట్‍మెంట్ లాంటి మల్టీ స్టారర్ లో కూడా నటించింది. ఇక తెలుగులో నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాకి నంది పురస్కారము అందుకుంది. అలాగే ప్రయోగాత్మక చిత్రం చందమామ కథలు సినిమాకి ఉత్తమ సహాయ నటిగా తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ ని అందుకుంది.

Image

అంతేకాదు బుల్లితెర మీద ప్రేమతో మీ లక్ష్మీ అన్న సెలబ్రిటీ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ ప్రోగ్రాం ద్వార పలువురు సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూస్ చేసింది. అలాగే మేము సైతం అన్న ప్రోగ్రాం ద్వారా ఎందరో పేదలను ఆదుకుంది. పలు టెలివిజన్ షోస్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసింది మంచు లక్ష్మీ.

కాగా తాజాగా మంచు తన ముద్దుల కూతురితో కలిసి కొత్త ఆఫీస్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన కూతురితో ఇలా కొత్త ఆఫీస్ లో అడుగుపెడుతుండతం తో చాలా సంతోషంగా ఉందని .. ఈ క్షణాలు ఎంతో మధురమైనవని .. ఇందుకోసం కొన్నాళ్ళుగా ఎంతో ఎగ్జైటింగా ఎదురు చూశానని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక మంచు లక్ష్మీ తన కూతురు తో కలిసి ఉన్న ఫొటోని అభిమానుల తో షేర్ చేసుకోగా ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

- Advertisement -

Related Posts

ఐటీ పాలసీ, EMC, డిజిటల్ లైబ్రెరీలపై సీఎం జగన్ సమీక్ష…పలు కీలక నిర్ణయాలు !

తాడేపల్లి: ఎపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్(EMC) ,గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైన అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ...

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

కరోనా మూడో వేవ్ ముప్పు: కనీస బాధ్యత లేని రాజకీయం.!

కరోనా సెకెండ్ వేవ్ ముప్పు దాదాపు తగ్గిందనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా రోడ్డెక్కేశారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల ప్రచారం కోసం జనాన్ని సమీకరించే ప్రయత్నాలు.....

Latest News