తనను దున్న తో పోల్చుకున్న మంచు విష్ణు

సినిమాల్లో కి వచ్చి ఇరవై ఏళ్ళు దాటిపోయినా ఇంకా స్టార్ హీరో కాలేకపోయాడు మంచు విష్ణు. మొదట్లో విష్ణు మీద అంత గా నెగటివిటీ లేకపోయినా….’మా’ ఎలక్షన్స్ లో రగడ వల్ల మంచు విష్ణు ట్రోల్ల్స్ కి గురవుతూ వస్తున్నాడు.

తాజాగా ఆయన తనని దున్నపోతుతో పోల్చుకోగా నెటిజెన్స్ కామెంట్స్ సెక్షన్ లో ట్రోల్ చేస్తున్నారు. అడవి దున్నపోతు ఫోటో పోస్ట్ చేసిన మంచు విష్ణు… పది పుష్ అప్స్ తీశాక నేను ఇలా ఫీల్ అవుతాను అని కామెంట్ చేశాడు. పుష్ అప్స్ అనంతరం ఆయన దున్నపోతు అంత బలంగా తయారైనంత ఫీలింగ్ కలుగుతుందన్న అర్థంలో మంచు విష్ణు ఆ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ని ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. చాన్నాళ్లుగా హిట్ లేని విష్ణు తన సినిమాలు తానే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘జిన్నా’ సినిమా పైనే ఉన్నాయి.  అక్టోబర్ లో విడుదల  కానున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.