హాలీవుడ్ నటులతో కూడా భారీ లెవెల్లో “కన్నప్ప” అట..!

టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు కాంట్రవర్సీ కుటుంబాల్లో మంచు ఫామిలీ కోసం అయితే తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక టైం లో మంచి పీక్ ని చూసిన మంచు వారి హీరోలు తర్వాత నెమ్మదిగా కామెడీగా మారిపోయారు. ఒక్క మంచు మనోజ్ మినహా మిగతా వారుపై ట్రోల్స్ చాలానే ఉన్నాయి.

కాగా ఇప్పుడు మాత్రం వీటి అన్నిటిని బ్రేక్ చేసేలా ఓ భారీ సినిమాని అయితే మంచు విష్ణు ఓ సినిమాని అనౌన్స్ చేసాడు. మరి ఆ సినిమానే “కన్నప్ప”. తాను మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరో ప్రభాస్, నయనతార ఇంకా మోహన్ లాక్ ఇలా ఇండియా నుంచే ఎంతోమంది బిగ్ స్టార్స్ నటిస్తుండగా ఈ సినిమా ఇప్పుడు న్యూజిలాండ్ లోనే చేస్తున్నట్టుగా ముందు కన్ఫర్మ్ చేశారు.

అయితే తాజాగా మంచు మోహన్ బాబు ఒక క్రేజీ అప్డేట్ అందించారు. తాను పోస్ట్ చేస్తూ “న్యూజిలాండ్  లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’.

90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో  అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం.” అని మంచు మోహన్ బాబు తెలిపాడు. దీనితో ఈ సినిమాని ఏ లెవెల్లో తెరకెక్కిస్తున్నారో అనేది అర్ధం చేసుకోవచ్చు.