ఏపీ పాలిటిక్స్ పై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ పోస్ట్..

shocking-news-about-manchu-lakshmis-first-husband

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనే కన్నా మెయిన్ గా ఏపీలో మాత్రమే ఓ రేంజ్ లో ఎంటర్టైనింగ్ గా మారాయని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ క్రమంలో తెలుగు సినిమాకి చెందిన అనేకమంది నటీనటులు కూడా ఈ పాలిటిక్స్ విషయంలో చాలా వరకు ఏదోకటి మాట్లాడ్డం కలుగజేసుకోవడం వంటిది ఆసక్తిగా మారుతూ వచ్చాయి.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ మరియు తెలుగు దేశం పార్టీతో అయితే రెండోసారి అలయన్స్ ని ప్రకటించిన విషయం మరోసారి బిగ్ సెన్సేషన్ గా నిలవగా ఈ అంశం పై ఆల్రెడీ చాలామంది ఫాన్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తోనే ఉన్నారు.

మరి ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఏపీ పాలిటిక్స్ పై మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి స్పందించడం వైరల్ గా మారింది తన ట్విట్టర్ ఖాతా నుంచి అయితే అందించింది. కాగా తాను పోస్ట్ లో వూహూ ఏపీ పాలిటిక్స్ ఇప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి అంటూ పోస్ట్ చేసింది.

దీనితో ఈమె నిన్న జరిగిన అలయన్స్ పట్ల సానుకూలంగా ఉందనే సంకేతం ఇచ్చింది అని చెప్పాలి. అంతే కాకుండా తాను మాత్రమే కాకుండా తన మంచు ఫ్యామిలీ కూడా అనుకూలమే అని దీనితో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే మంచు మోహన్ బాబు వైసీపీ పార్టీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వీరు నెక్స్ట్ తీసుకునే నిర్ణయం ఏంటో బయటకి వచ్చి పవన్ బాబు లకి సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి. కాగా ఇప్పుడు అయితే మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ లో “భక్త కన్నప్ప” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
https://x.com/LakshmiManchu/status/1702578870627467562?s=20