మరో సారి పెళ్లి పీటలెక్కబోతున్న మంచు మనోజ్

మోహన్ బాబు తనయుడిగా వెండితెరకు పరిచయమైన మంచు మనోజ్ చాలా మంచి సినిమాల్లో నటించాడు కానీ అనుకున్నంత సక్సెస్ రాలేదు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత ఇప్పటికే ఏ సినిమాలో కనిపించలేదు మనోజ్. ‘అహం బ్రహస్మి’ అనే సినిమా మొదలు పెట్టాడు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.

మనోజ్ కి పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పెళ్ళైన కొన్నాళ్లకే భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ మధ్య మంచు మనోజ్ రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి తో మనోజ్ ఈ మధ్య చనువుగా మెదులుతున్నాడు.

వీళ్లిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా  హైదరాబాద్ సీతాఫల్ మండిలో ఓ వినాయక మండపానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు సినీనటుడు మంచు మనోజ్.

ఆయనతో పాటు భూమా మౌనిక రెడ్డి పక్కనే వుండటంతో ఈ విషయం కాస్త సినీ ఇండస్ట్రలో అలాగే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వధువు ఎవరో కాదు దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి.

ఈమెను మనోజ్ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కాగా హైదరాబాద్ సీతాఫల్ మండిలో ఓ వినాయక మండపానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు సినీనటుడు మంచు మనోజ్.

ఆయనతో పాటు దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి పక్కనే వుండటంతో ఈ విషయం కాస్త సినీ ఇండస్ట్రలో అలాగే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.