వీల్ చైర్ కి పరిమితమైన లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్.. ఆందోళన అభిమానులు!

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదటిసారిగా లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇకపోతే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా లెజెండరీ నటుడు మైక్ టైసన్ నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలా ఉండగా తాజాగా మైక్ టైసన్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసినది కావడం విశేషం. అయితే ఈ ఫోటోలలో మైక్ టైసన్ వీల్ చేరుకు పరిమితం అవడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది.ఇలా ఈయన వీల్ చైర్ కి పరిమితమై చేతిలో స్టిక్ ఉండడం చేత అతనికి ఏమైంది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఈయన నడవలేని పరిస్థితిలో ఉండి వీల్ చైర్ కు పరిమితమైనప్పటికీ కొందరు మాత్రం ఈయనతో సెల్ఫీలు దిగడానికి ఆత్రుత కనబరుస్తున్నారు.

ఈ విధంగా వీల్ చైర్ కి పరిమితం కావడంతో ప్రతి ఒక్కరూ ఇతనికి ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అయితే మైక్ టైసన్ గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి సయాటికా సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అందుకే వైద్యులు తనకు వీల్ చైర్ సూచించడంతో ఈయన వీల్ చైర్ కి పరిమితమైనట్టు తెలుస్తుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తనకు ఎక్స్పైరీ డేట్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.ఇలా ఎంతో గంభీరంగా ఉన్నటువంటి ఈయన ఒక్కసారిగా వీల్ చైర్ కి పరిమితం కావడంతో ఈయన తొందరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.