ఏదో అనుకుంటే, ఇంకోటేదో అవుతోంది.! ప్రతిసారీ తనకే ఎందుకిలా అవుతోంది.? ఇదీ ఇప్పుడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ ఆవేదన. ‘లైగర్’ నుంచి ఏదీ కలిసి రావడంలేదు విజయ్ దేవరకొండకి.! ‘ఖుషీ’ ఫ్లాప్, ‘ఫ్యామిలీ స్టార్’ కూడా అతన్ని గట్టున పడేయలేదు.
అసలు ఎలాంటి కథల్ని ట్రై చేయాలి? ఏం చేస్తే మళ్ళీ విక్టరీ తన సొంతవరతుంది.? అంటూ సన్నిహితుల వద్ద మల్లగుల్లాలు పడుతున్నాడట విజయ్ దేవరకొండ. ఇదంతా స్వయంకృతాపరాధమేనా.? అంటే, అలా అనడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు.
అయితే, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా మాత్రం రాంగ్ టైమింగ్ అనే చర్చ జరుగుతోంది. పరశురామ్‌తో ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా వుండి వుండాల్సిందన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పెర్ఫామర్‌గా పరిణతి సాధిస్తున్నాడు, ప్రమోషన్లలో ఎప్పుడూ ముందే వుంటాడు. కానీ, కథల ఎంపికలో విజయ్ దేవరకొండ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఈ మధ్యాకాలంలో కాంబినేషన్ మీద క్రేజ్‌తో మంచి మంచి కథలు వదిలేసుకున్నాడట విజయ్ దేవరకొండ.
ఆ తప్పుల్ని సమీక్షించుకుని, లిమిటెడ్ బడ్జెట్‌లో ఓ యంగ్ డైరెక్టర్‌తో స్వీయ నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాడన్నది తాజా ఖబర్. నిజమేనా.? అది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
విజయ్ దేవరకొండకి బాగా ఇష్టమైన ఓ బ్యూటీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందిట.