‘కన్నప్ప’ నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల!

మంచు విష్ణు ప్రధానపాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’ రూపుదిద్దుకొంటోంది. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ నుంచి చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ’కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

ఇందులో మంచు విష్ణు కన్నప్పగా కనిపించి అలరించారు. భారీ బ్జడెట్‌, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులు గా కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తుండగా, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.’కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు.