త్రివిక్రమ్ సాయం కోరుతున్న యంగ్ టైగర్ ఎన్టీయార్.!

‘ఆచార్య’ సినిమా తర్వాత కొరటాల శివ, ఎన్టీయార్‌తో సినిమా చేయాలి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కాల్సి వుంది. ఎప్పుడో ఇదంతా జరగాల్సి వుంది. ఇంకా ఇప్పటికీ జరగడం లేదు. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, కొరటాల దర్శకత్వంలో ఎన్టీయార్ కాదు.. అల్లు అర్జున్ సినిమా చేసి వుండాలి. కానీ, ఈక్వేషన్స్ మారిపోయాయ్ అనివార్య కారణాలతో. దాంతో, అల్లు అర్జున్ పక్కకు వెళ్లి ఎన్టీయార్, కొరటాల లైన్‌లోకి వచ్చాడు. అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీయార్ సినిమా చేస్తుండాలి. ఇదీ మారింది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా నడుస్తోంది.

ఇక, కొరటాల – ఎన్టీయార్ సినిమా రేపో మాపో సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుండగా.. తాజా ఖబర్ ఏంటంటే, యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చర్చలు జరుపుతున్నాడట. ఇదో కొత్త ఈక్వేషన్‌లా లేదూ. ఎందుకీ చర్చలు.? అన్న దానిపై భిన్న వాదనలున్నాయి.

ఇదిగో అదిగో అంటున్న కొరటాల శివ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదు. ఈ ఆలస్యంతో ఎన్టీయార్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దాంతో, ఇక పూర్తిగా కొరటాలను సైడేసేయాలనుకుంటున్నాడా ఎన్టీయార్.? అని కొత్త అనుమానం తెరపైకొచ్చింది. ఇది అనుమానమే కాదు, దాదాపు నిజమే అని ఇండస్ట్రీలో గప్ చుప్ గుసగుసలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీయార్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సో, అదే సెంటిమెంట్ ఈ కాంబినేషన్‌కి సెట్ అయ్యేందుకు సూచిస్తోందా.? గతంలో కొరటాల శివ – ఎన్టీయార్ కాంబోలో ‘జనతా గ్యారేజ్’ కూడా సూపర్ హిట్ మూవీనే. బట్, ఫర్ ఏ ఛేంజ్.! ‘ఆచార్య’ రూపంలో కొరటాల శివ డైరెక్షన్‌కి గ్రహణం పట్టింది. అందుకే ఈ మసక మసక చీకట్లు.!