ఆ సినిమా డిజాస్టర్ తో ఆర్థికంగా చాలా నష్టపోయాను: కళ్యాణ్ రామ్

నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వారిలో కొంతమంది మాత్రమే హీరోలుగా పాపులర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. బాలనటుడిగా తన సినీ కెరీర్ ప్రారంభించిన కళ్యాణ్ రామ్ హీరోగా ఎక్కువ హిట్స్ అందుకోలేకపోయాడు. గతంలో వచ్చిన పటాస్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసార పాత్రలో కనిపించనున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ , టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాదులో చాలా ఘనంగా నిర్వహించారు.

సినిమా విడుదల తేదీ సమీపించడంతో కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో కల్యాణ్ రామ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కళ్యాణ్ రామ్ సినిమా కెరీర్లో ఓం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిందని, అప్పట్లో ఓం సినిమాని త్రీడీ గా తెరకెక్కించడానికి భారీగా ఖర్చు చేశామని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. అయితే ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా వల్ల భారీ స్థాయిలో నష్టపోయానని, ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి రెండేళ్లు పట్టిందని కళ్యాణ్ వెల్లడించాడు. ఆ సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ సినిమా ఓం సినిమా తెచ్చిన నష్టాలను భర్తీ చేసిందని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు.