గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన చిత్రాలు సహా తన రాజీకీయాల్లో కూడా మంచి బిజీగా ఉన్నాడు. ఓ పక్క సినిమాలతో అదరగొడుతూ ఉండగా మరో పక్క అయితే పవన్ రాజకీయాల్లో కూడా తన వారాహి యాత్రతో మరింత బలం తెచ్చుకున్నాడు విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఇదిలా ఉండగా పవన్ నటించిన “బ్రో” అనే చిత్రం తాలుకా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్ననే జరిగింది. కాగా ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండగా పవన్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. అయితే పవన్ ఈ ఈవెంట్ లో తమిళ సినిమాకి సంబంధించిన రీసెంట్ కాంట్రవర్సీపై స్పందించడం విశేషంగా మారింది.
అయితే అసలు ఈ కాంట్రవర్సీ ఏమిటంటే రీసెంట్ గానే తమిళ సినిమా ఆర్టిస్ట్స్ ఫెడరేషన్ సంస్థ వారు ఒక కొత్త రూలు తెచ్చుకున్నారు. తమిళ సినిమాలు తీస్తే తమిళనాడులోనే తీయాలి అందరు తమిళ నటులు మాత్రమే ఉండాలి. ఇతర రాష్ట్రాలలో షూటింగ్ చేయకూడదు, విదేశాలకు అవసరం అయితే తప్ప వెళ్ళకూడదు.
మొత్తం తమిళ యూనిట్ మాత్రమే సినిమాకి చేయాలి అని ఓ రూల్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా దగ్గర అన్ని సినీ వర్గాలు కలిసి పని చేస్తుండడంతో ఇది చాలా మందికి అసంతృప్తిగా అనిపించింది. అయితే దీనిపై పవన్ స్పందించాడు. ఈ కొత్త రూల్ మార్చాలని ఇప్పుడు అన్ని సినీ వర్గాల వారు అందరితో పని చేస్తున్నారు అలా చేయాలి అప్పుడే సినీ పరిశ్రమ అన్ని విధాలుగా బాగుంటుంది.
తమ చిత్రానికి ఓ తమిళ దర్శకుడే వర్క్ చేసాడని అలాగే తమ నిర్మాత ఏ ఎం రత్నం తమిళ్ లో సినిమాలు చేసి భారీ విజయాలు అందుకున్నారు అని ఈ సున్నిత అంశంపై అయితే పవన్ చెప్పిన విధానం ఇపుడు వైరల్ గా మారగా ఈ అంశంపై ఇలా స్పందించాలి అంటే గట్స్ కావాలి అని పవన్ కి ఆ దమ్ము ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.