RRR: ఆర్ ఆర్ ఆర్ సినిమా రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తా ఏమిటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ పాత్రలో ఎన్టీఆర్, రామ్ పాత్రలో చరణ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. కొన్ని సన్నివేశాల్లో తారక్ తన నటనతో అభిమానులను ఫిదా చేశారు. సినిమా విడుదల అయిన మొదటి వారం భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది, ఇక రెండో వారం కూడా అదే కొనసాగుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రామ్ చరణ్ సరసన సీత పాత్రలో చాలా చక్కగా నటించారు. అలాగే కొమరం భీమ్ ఎన్టీఆర్కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించడం జరిగింది. సినిమాలో ఆలియా భట్ పాత్రకు నిడివి తక్కువగా ఉన్నా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు. ఇక ఒలీవియా మోరిస్ కు ఆలియా భట్ తో పోలిస్తే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. ఈమె కూడా జెన్నీ పాత్రకు న్యాయం చేశారు.
అయితే మొదట రాజమౌళి సినిమా మొదలు పెట్టేటప్పుడు సీత,జెన్నీ పాత్రలకు హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లను అనుకోలేదట. రాజమౌళి మొదట సీత పాత్ర కోసం శ్రద్ధా కపూర్ ను అనుకున్నాడట. అయితే శ్రద్ధా కపూర్ అప్పుడు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన సాహో సినిమాలో నటిస్తుండటం వలన ఈ సినిమాకు ఓకే చెప్పలేదట.ఇక జెన్నీ పాత్ర కోసం మొదట డైసీ ఎడ్గర్ జోన్స్ అనే మరో ఇంగ్లీష్ అమ్మాయిని ఎంపిక చేసుకోబోతున్నట్లు జక్కన్న అధికారికంగా ప్రకటించాడు.కానీ కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. వాళ్ళు కనుక చేసి ఉంటే.. ఈ పాత్రలు ఎలా ఉండేవో..!