టాలీవుడ్ ఆడియెన్స్ లో మెయిన్ గా యూత్ లో అయితే బాగా గుర్తుండిపోయే సినిమాలు లిస్ట్ కొన్ని తీస్తే వాటిలో ఒకపుడు “హ్యాపీ డేస్”, “కొత్త బంగారు లోకం” తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలు ఉండేవి తర్వాత ఈ తరహా ఎంటెర్టైనెర్స్ తగ్గిపోయాయి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏదో ఓ సినిమా వచ్చింది.
కానీ కంప్లీట్ ఒక కొత్త ఫ్రెష్ ఎంటర్టైనర్ గా ప్రెజెంట్ జెనరేషన్ లో మరో క్లాసిక్ గా నిలిచిన సినిమా ఏది అంటే? అది డెఫినెట్ గా “ఈ నగరానికి ఏమైంది?” సినిమా అని చెప్పి తీరాలి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం 2018లో రిలీజ్ అయ్యింది కానీ అంతగా రాణించలేదు.
అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకి ఈ సినిమా రీ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఈ చిత్రాన్ని గత కొన్నాళ్ల కితం ఇదే జూన్ 29 న రిలీజ్ చేయగా మళ్ళీ ఇదే స్పెషల్ డేట్ కి అయితే ఈ చిత్రాన్ని ఈ జూన్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు. దీనితో అయితే ఈ క్రేజీ రైడ్ ని ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులో మిస్ కాకూడదు అని యూత్ ఫిక్స్ అయ్యిపోయారు.
మరి ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఇక ఈ చిత్రానికి అయితే వివేక్ సాగర్ సూపర్ ఆల్బమ్ అందించగా ప్రముఖ నిర్మాణం సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అయితే అప్పుడు మిస్ అయ్యిన వసూళ్లు ఈసారి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందని తీరాలి. అలాగే మేకర్స్ రెండో పార్ట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు.
#EeNagaranikiEmaindi will be returning to select theatres and clubs on June 29th! Celebrate friendship with the #ENE Re-Release and enjoy #KeedaaCola teaser as a bonus.
See you on 29th June with your gangs!🍿🍿🍿🍻🍻🍻#5YearsOfENE pic.twitter.com/cHMBQxBGRi
— Suresh Productions (@SureshProdns) June 14, 2023