లేటెస్ట్ గా టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ కోసం ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఫ్యాన్ షోస్ గా స్టార్ట్ అయ్యిన ఈ ట్రెండ్ ఇప్పుడు పలు క్లాసిక్ చిత్రాలు రీ రిలీజ్ కి వరకు వచ్చింది. మరి అలా ఆడియెన్స్ డిమాండ్ మేరకు లేటెస్ట్ గా రీ రిలీజ్ కి వచ్చిన క్రేజీ చిత్రమే “ఈ నగరానికి ఏమైంది”.
అప్పట్లో ఈ సినిమా విలువ తెలియక పక్కన పెట్టేసిన ఆడియెన్స్ ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ కి భారీ డిమాండ్ నెలకొనగా నిన్ననే హైదరాబాద్ సిటీ లో షోస్ తో అయితే ఈ సినిమా వచ్చింది. మరి ఈ డిమాండ్ ఇప్పుడు కాసుల వర్షంలో యూత్ అందిస్తున్నారు.
కాగా లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఈ రెండు రోజుల వసూళ్లు ఇంకా రెండో రోజు కూడా కంప్లీట్ కాకుండా 1 కోటి గ్రాస్ కి చేరినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే నిన్న జూన్ 28న లిమిటెడ్ షోస్ కి 20 లక్షల గ్రాస్ రాగ మరి ఈరోజు జూన్ 29 మొత్తం కంప్లీట్ అవ్వకుండానే 80 లక్షల గ్రాస్ ని అందుకుంది.
దీనితో అప్పుడే 1 కోటి గ్రాస్ ని ఈ సినిమా రాబట్టడం విశేషం. అలాగే రీ రిలీజ్ లలో ఓ చిన్న సినిమా ఈ సాలిడ్ మార్క్ ని కొట్టడం చిన్న విషయం కూడా కాదు. ఆల్రెడీ వారం రోజులకి ఎక్స్ టెండ్ చేసిన ఈ రిలీజ్ ఫైనల్ వసూళ్లు ఎలా రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అయితే తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించగా విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. అలాగే వివేక్ సాగర్ సంగీతం అందించాడు.
#EeNagaranikiEmaindhi ❤️🙏 pic.twitter.com/kYSdjBhPJm
— Suresh Productions (@SureshProdns) June 29, 2023