ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న కొంతమంది నోటెడ్ హీరోస్ లో అయితే యంగ్ నటుడు విశ్వక్ సేన్ కూడా ఒకడు. ఒక్క నటుడు గానే కాకుండా తాను డైరెక్టర్ గా కూడా పలు చిత్రాలు చేయగా తన లాస్ట్ చిత్రం “దాస్ కా ధమ్కీ” అయితే సూపర్ హిట్ అయ్యి తన కెరీర్ లో పెద్ద హిట్ అయ్యింది.
కాగా ఈ చిత్రం తర్వాత తాను మరిన్ని సినిమాలు చేస్తుండగా వాటిలో అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో చేసిన సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా విషయంలో ఈ యంగ్ హీరో చేసిన లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
ఈ సినిమా ఆల్రెడీ ఉన్న రేస్ లో చాలా చిత్రాలు ఉండడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారో ఏమో కానీ ఒకవేళ ఆ టైం కి రిలీజ్ అవ్వకపోతే బాగుండదు అన్నట్టుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు విశ్వక్. తాను పెట్టిన పోస్ట్ లో బాక్గ్రౌండ్ లేకపోతే ప్రతీ నాకొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు.
తగ్గేకొద్దీ మనల్ని మింగుతూనే ఉంటారు. ప్రాణం పెట్టి పని చేస్తే అది హిట్ ప్లాప్ ఏదైనా కూడా డిసెంబర్ 8న అయితే శివాలెత్తిపోతుంది. ఒకవేళ సినిమా కానీ డిసెంబర్ లో రిలీజ్ అవ్వలేదు అంటే ఇక నన్నెవరూ ప్రమోషన్స్ లో చూడలేరు అని తేల్చేసాడు.
దీనితో విశ్వక్ సేన్ ని ఇబ్బంది పెడుతుంది ఎవరు ఇతర సినిమాలు మూలానే ఈ సినిమా నిర్మాతలు ఆ డేట్ నుంచి తప్పిద్దాం అని చూస్తున్నారా? అందుకే వారికి విశ్వక్ సేన్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడా అంటూ ఓ టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇదంతా కేవలం ప్రమోషన్స్ కోసమే చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఈ విషయంలో అసలు మేటర్ ఏంటి అనేది తేలాల్సి ఉంది.