బాక్సాఫీస్ : 3 రోజుల్లో కుమ్మేసిన “దాస్ కా ధమ్కీ” వసూళ్లు.!

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర ప్రతీ పండగకి అయితే సరైన సినిమాలే పడుతున్నాయని చెప్పాలి. ఆల్ మోస్ట్ ప్రతి పండగలో మంచి సక్సెస్ రేట్ లో అయితే పలు సినిమాలు వస్తుండగా అలాగే ఈసారి ఉగాది కానుకగా వచ్చిన సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న సినిమాలో “దాస్ కా ధమ్కీ” కూడా ఒకటి.

మరి ధమ్కీ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటించగా నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా అయితే మొదటి రోజే వరల్డ్ వైడ్ గా దాదాపు 9 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా నెక్స్ట్ డే వర్కింగ్ డే కావడంతో కాస్త డ్రాప్ అయ్యింది.

దీనితో 12 కోట్ల మేర వసూళ్లు రాగా ఇక మూడో రోజుకి అయితే 3 కోట్ల గ్రాస్ తో 15 కోట్లు ఈ సినిమా అందుకుని సూపర్ రన్ లో దూసుకెళ్తుంది. అంతే కాకుండా ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు ఈ సినిమాతో నమోదు అయ్యాయి. కాగా ఈ సినిమా లాంగ్ రన్ లో అయితే 25 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు.

మొత్తానికి అయితే విశ్వక్ సేన్ మాత్రం తన కెరీర్ లోనే భారీ హిట్ ని ఈ సినిమాతో అందుకున్నాడని చెప్పాలి. మరి ఈ సినిమాకి దర్శకుడిగా కూడా విశ్వక్ సేన్ నే వ్యవహరించడం విశేషం. ఇక నెక్స్ట్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండగా దీనిని తర్వాత ప్లాన్ చేస్తున్నారు.