ఓటిటి : “దాస్ కా ధమ్కీ” వచ్చేస్తున్నాడు..ఎప్పుడు ఎందులో?

టాలీవుడ్ యూత్ లో ప్రెజెంట్ మంచి క్రేజ్ ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మాస్ కా దాస్ గా పిలవబడే యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో రీసెంట్ గా తన కెరీర్ లో బిగ్ హిట్ ని అయితే తన స్వయంగా డైరెక్ట్ చేసిన సినిమా “దాస్ కా ధమ్కీ” తో కొట్టాడు.

ప్రసన్న కుమార్ బెజవాడ కథతో వచ్చిన ఈ సినిమా కాస్త రొటీన్ లైన్ తోనే వచ్చినా విశ్వక్ సేన్ తన డైరెక్షన్ తో అదరగొట్టి సినిమాని తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా అయితే నిలుపుకున్నాడు. కాగా ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించి ఆమె కూడా గ్లామర్ డోస్ తో అదరగొట్టగా. 

ఈ సినిమా ఇపుడు థియేటర్స్ లో రన్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. మరి ఈ సాలిడ్ సినిమా ఇప్పుడు ఓటిటీలో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమా ఓటిటి హక్కులు ఆహా వారు కొనుగోలు చేసుకోగా ఇందులో ఈ సినిమా ఈ ఏప్రిల్ 14 నుంచి అయితే స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఆహా వారు లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు.

దీనితో దాస్ కా ధమ్కీ అయితే ఫైనల్ గా మరికొన్ని రోజుల్లో ఓటిటి లో రాబోతుంది. ఇక ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వహించాడు. అలాగే వణ్మయి క్రియేషన్స్ వారు ఏఈ సినిమాని నిర్మాణం వహించారు.