Dulquer Salman : ఆ హీరో చేసిన పనికి అతని సినిమాలను నిషేధించిన థియేటర్స్.. ఎవరా ఆ హీరో?

Dulquer Salman: మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా కేరళ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు దుల్కర్ సల్మాన్.దుల్కర్ సల్మాన్ కు కేరళలోనే కాదు మన టాలీవుడ్ లో కూడా ఫాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది.దుల్కర్ సల్మాన్‌ ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు ఇంకాస్త చేరువయ్యాడు.

ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్యూట్’. ఈ చిత్రానికి రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించగా, డయానా పెంటీ కీలక పాత్ర పోషించింది.దుల్కర్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వే ఫారర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాడు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు దుల్కర్ సల్మాన్‌ సినిమాలపై నిషేధం విధించాయి.

అంతేకాకుండా, భవిష్యత్తులో అతడు నటించబోయే చిత్రాలతోపాటు ఇదివరకు నటింటిన సినిమాలన్నింటీని బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్‌ఈయూకే) నిర్ణయించింది.ఈ సందర్భంగా థియేటర్ల ఓనర్స్ అందుకు ప్రధాన కారణం కూడా ఇదేనంటూ ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్యూట్’.మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన సోనీలైవ్ విడుదల చేయాలని దుల్కర్ నిర్ణయించుకున్నాడు. ‘సెల్యూట్’ను థియేటర్లలో రిలీజ్ చేయకుండా, నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తుండటంతో అతడి సినిమాల్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ఎఫ్‌ఈయూకే నిర్ణయించుకుంది. అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై దుల్కర్ ఇప్పటి వరకు స్పందించ లేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఎందుకు దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం విధించారు? అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.