Venky Atluri: తెలుగు ప్రేక్షకులకు హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన లక్కీ భాస్కర్ సినిమా గురించి కూడా మనందరికీ తెలిసిందే. భారీ అంచనాలను విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకి అట్లూరి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే తమిళంలో ధనుష్ తో తెరకెక్కించిన సార్ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది.
గత ఏడాది దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కించి మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇది ఇలా ఉంటే వెంకీ అట్లూరి ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయాడు.
ఆయనకు లక్కీ భాస్కర్ కథ ఫస్టాఫ్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా అయిపోయాక చాలామంది పీరియాడిక్ ఫిలిం, బయోపిక్స్ చేస్తారా? అని అడిగారు. కానీ పీరియాడిక్, బయోపిక్, సంచలన థ్రిల్లర్ చిత్రాలు నేను చేయను. కుటుంబ కథా చిత్రాలు చేయాలని ఉంది. లక్కీ భాస్కర్ కు సీక్వెల్ ఉంటుంది అని చెప్పుకొచ్చారు వెంకీ. కాగా లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన విషయం తెలిసిందే. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను కలిసి నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 2024 అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.111 కోట్లు రాబట్టింది. మరి ఈ సినిమా సీక్వెల్ పై అప్డేట్ ను ఎప్పుడు ఇస్తారో చూడాలి మరి.
