Kannappa OTT Release: టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణువు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కన్నప్ప. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్ట్స్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాంటి నటీనటులు నటించి మెప్పించారు. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. హీరో మంచు విష్ణు ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లేను అందించారు.
ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా జూన్ 27న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కన్నప్ప స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో తెలియజేశారు. పరమ శివ భక్తుడైన తిన్నడు జీవిత కథ ఆధారంగా కన్నప్ప చిత్రం తెరకెక్కింది.
విష్ణు టైటిల్ రోల్ ప్లే చేశారు. రుద్రగా ప్రభాస్, కిరాతుడిగా మోహన్ లాల్, శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ నటించిన విషయం తెలిసిందే. సినిమాలో చివరి 40 నిమిషాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విష్ణు నటన, స్క్రీన్ ప్రజెన్స్ ప్రశంసలు అందుకుంది. అయితే థియేటర్ లో విడుదల అయ్యి మంచి సక్సెస్ అయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి మరి.
Kannappa OTT Release: కన్నప్ప ఓటీటీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
