ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అనేక ఛానెల్స్ వారు చాలానే కసరత్తులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తూ ఏదేదో చేస్తూ ఉంటారు. అలా వచ్చిన ఓ రివొల్యూషనరీ షో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ అని చెప్పాలి.
మరి ఈ షో తెలుగులో ఎంటర్ కావడం ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం ఇండియా లోనే అత్యధిక రేటింగ్ అందుకునే టీవీ షో గా మారడం జరిగిపోయాయి. అయితే ఇది మొత్తం 5 సీజన్ల వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు తెలుగు సీజన్ 6 మాత్రం అంత అనుకున్న రేంజ్ లో పడట్లేదు.
దీనితో ఈసారి బిగ్ బాస్ 6 ఫైనల్ కి గాను డిజాస్టర్ రేటింగ్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకీ ఈసారి రేటింగ్ ఎంత వచ్చింది అంటే జస్ట్ 8.17 మాత్రమే అట. ఇది యావరేజ్ గా చూసినట్టు అయితే మొత్తం సీజన్ల లో ఇది సగం రేటింగ్ మాత్రమే అని చెప్పాలి.
అంటే బిగ్ బాస్ కి తెలుగులో సగం రేటింగ్ పడిపోయింది. దీనితో ఈసారి బిగ్ బాస్ మాత్రం భారీ డిజాస్టర్ అయ్యిందని చెప్పి తీరాలి. మరి దీనికి అనేక కారణాలు ఉన్నాయి అని చెప్పుకోవాలి. ప్రతి సీజన్లో ఒకే హోస్ట్ రొటీన్ డ్రామా ఉంటుండడంతో ఆడియెన్స్ లో అంత ఆసక్తి రావట్లేదు. దీనితో ఇంత తక్కువ రేటింగ్ వచ్చింది అని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ స్టార్ మా యాజమాన్యం ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.