ఇండస్ట్రీ టాక్ : ఈసారి “బిగ్ బాస్ 7” ఫైనల్స్ గెస్ట్ ఎవరంటే??

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ఉన్న పలు మోస్ట్ ఎంటర్టైనింగ్ షోస్ లో అది కూడా పలు రియాలిటీ గేమ్ షోస్ లో అయితే బిగ్ బాస్ షో కూడా ఒకటి. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యినటువంటి ఈ షో అయితే తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యింది. కాగా తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్ లు కంప్లీట్ కాగా ఇపుడు ఏడవ సీజన్లోకి వచ్చింది.

అయితే గడిచిన రెండు సీజన్స్ కి గాను చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా అయితే మళ్ళీ సీజన్ 7 కి డ్రామా మసాలా ఎక్కువ కావడంతో సీజన్ హిట్ అయ్యింది. వీక్ డేస్ లో కూడా బాగానే రేటింగ్ రాగా ఇక ఈ సీజన్ కూడా ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. అయితే గడిచిన సీజన్స్ చూసినట్టు అయితే గ్రాండ్ ఫైనల్ కి గెస్ట్ లుగా పెద్ద నోటెడ్ సెలెబ్రెటీలు పెద్దగా వచ్చింది లేదు.

వీటితో ఫైనల్ రేటింగ్స్ కూడా అంత ఇంపాక్ట్ లేవు. అయితే ఈసారి మాత్రం ఇవన్నీ చేంజ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ ఫైనల్ ఎపిసోడ్ కి ఉన్న ఎన్నో స్పెషల్ అట్రాక్షన్ లో అయితే ఫైనల్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది.

మరి దీనితో ఈ క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉంది. అలాగే మహేష్ గెస్ట్ గానే కాకుండా తన “గుంటూరు కారం” ప్రమోషన్స్ కూడా బిగ్ బాస్ స్టేజి మీద చేస్తున్నట్టుగా ఉంటుంది అని తాను అలా కూడా వస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.