ఇండస్ట్రీ టాక్ : బాలయ్య లేకపోతే ఎన్టీఆర్ తో ప్లానింగ్.?

నందమూరి నట వారసులు నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఇప్పుడు తమ తమ భారీ సినిమాలు తో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఒక్క వెండితెర మీద మాత్రమే కాకుండా చిన్న తెరపై కూడా మంచి సక్సెస్ అయ్యారు.

ఎన్టీఆర్ అయితే మొదట బిగ్ బాస్ అలాగే నెక్స్ట్ ఎవరు మీలో ఎవరు కోటీశ్వరులు అనే రెండు రియాలిటీ షో లతో అదరగొట్టగా బాలయ్య అయితే ఓటిటి లో అన్ స్టాప్పబుల్ అనే ఎంటర్టైనింగ్ టాక్ షో తో ఇప్పుడు అలరిస్తున్నారు.

ఇక తెలుగులో అయితే బిగ్ బాస్ షో 7వ సీజన్ దగ్గరకి రాగ ఈసారి మాత్రం యాజమాన్యం కొత్త హోస్ట్ కోసం చూస్తున్న విషయం బాగా వినిపిస్తుంది. మరి దీనికి గాను మొదటి వరుస లో నటసింహ బాలయ్య పేరు గట్టిగా వినిపిస్తూ ఉండగా ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పేరు కూడా బయటకి వచ్చింది.

అయితే బాలయ్య లేకపోతె ఎన్టీఆర్ లో ఎవరొకరు హోస్ట్ గా కనిపించే ఛాన్స్ ఉందని ఇప్పుడు పలు రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇంతకీ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఎక్కువ శాతం మంది బాలయ్య ని బిగ్ బాస్ హోస్ట్ గా చూడాలని ఆసక్తి కనబరుస్తున్నారు.