మళ్ళీ ఆల్ టైం హైయెస్ట్ టీఆర్పీ అందుకున్న “బిగ్ బాస్” 

అప్పటివరకూ తెలుగు బుల్లితెర దగ్గర పలు రియాలిటీ షోస్ అన్నీ ఒక ఎత్తు అయితే మరో పక్క వాటి అన్ని ఫార్మాట్ ని బ్రేక్ చేస్తూ వచ్చిన మరో షో బిగ్ బాస్ ఇంకి ఎత్తు అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ట్ అయిన ఈ గ్రాండ్ రియాలిటీ షో తెలుగు ఆడియెన్స్ కి ఒక సరికొత్త అనుభూతి ఇవ్వడంతో భారీ రేటింగ్స్ తో అదరగొట్టింది.

అయితే ఈ షో ఇప్పుడు వరకు మొత్తం 7 సీజన్లను కంప్లీట్ చేసుకోగా ఈ ఏడు సీజన్లలో 5 సీజన్స్ హిట్ అయ్యాయి రెండు సీజన్ లు ప్లాప్ అయ్యాయి. కాగా మొన్న ఈ ఏడవ సీజన్ రాకుముందు వరకు అయితే బిగ్ బాస్ 4 సీజన్ కి ఆల్ టైం హైయెస్ట్ రికార్డు ఉంది.

కాగా బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి గాను 21.7 టీఆర్పీ రేటింగ్ వస్తే ఇప్పుడు మళ్ళీ ఇదే రేటింగ్ బిగ్ బాస్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి కూడా రావడం విశేషం. దీనితో మళ్ళీ ఆల్ టైం హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ని ఈ షో అందుకుంది అని చెప్పాలి. అయితే ఇది కేవలం తెలుగు కానీ సౌత్ ఇండియా టెలివిజన్ లోనే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గానే ఆల్ టైం హైయెస్ట్ అని తెలుస్తుంది.

మొత్తానికి అయితే ఈ షో మాత్రం మళ్ళీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చి క్రేజీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. మరి నెక్స్ట్ సీజన్ కూడా ఎలా ఉంటుందో అనేది చూడాలని ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్నారు.