బిగ్ అప్డేట్ : “బిగ్ బాస్ 7” వచ్చేస్తోందహో..!

ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి సామాన్యుడికి కూడా ఎంటర్టైన్మెంట్ చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఎన్నో టెన్షన్స్ మధ్య ఓ వెబ్ షో లేదా టెలివిజన్ షో అయితే వారికి ఊరట ఇచ్చే మాధ్యమంగా అయితే వారు ఎంచుకుంటున్నారు. అలా వరల్డ్ వైడ్ ఇతర దేశాల్లో స్టార్ట్ అయ్యి ఇండియాలో కూడా ఎంతో ఫేమస్ గా మారిపోయిన సెన్సేషనల్ టెలివిజన్ రియాలిటీ షోనే “బిగ్ బాస్”.

అయితే హింది, తమిళ్ సహా మళయాళ భాషల్లో కూడా పెద్ద హిట్ అయ్యిన ఈ షో మన తెలుగులో కూడా స్టార్ట్ అయ్యి ఏకంగా ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్ రాబట్టిన రియాలిటీ షోగా అయితే నిలిచింది. హిందీలో ఎన్నో సీజన్స్ ముందు ఉన్నప్పటికీ కూడా తెలుగులో సీజన్ కె రికార్డు ఆదరణ రావడం విశేషం.

మరి దీనితో అయితే ఈ షో తెలుగులో ఎంత పెద్ద హిట్ అనేది అర్ధం చేసుకోవచ్చు. కాగా ఇప్పటికి 6 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఫైనల్ గా 7వ సీజన్లోకి వస్తున్నట్టుగా బిగ్ అప్డేట్ ని ఇప్పుడు స్టార్ మా వారు రివీల్ చేశారు. టీవీ లో సహా సోషల్ మీడియాలో కూడా కొత్త ప్రోమో కట్ ని రిలీజ్ చేసి అతి త్వరలోనే అయితే బిగ్ బాస్ షో కొత్త సీజన్ టెలికాస్ట్ ఉంటుంది అని ఫిక్స్ చేశారు.

దీనితో ఈ సడెన్ సర్ప్రైజ్ తో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ సారి కూడా కంప్లీట్ పాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నామని తెలుపుతున్నారు. ఇక ఈసారి హోస్ట్ ఎవరు అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ స్లాట్ లో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ తర్వాత అయితే ఇది టెలికాస్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది.