CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటి పై దాడి.. ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై జేయు జేఏసీ నేతలు ఇష్టం వచ్చిన విధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. రాళ్లు, టమోటాలని విసురుతూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న పూల కుండీలను మొత్తం ధ్వంసం చేస్తూ నానా రచ్చ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న కూడా వినిపించుకోకుండా చాలా నష్టం కలిగించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనలో భాగంగా 6 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో మరోసారి సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాజకీయ నేతలు అలాగే పోలీసు వారు స్పందిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఏమైనా కు ఈ ఘటనపై స్పందించిన ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.

 

అలాగే ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించారు.. హైదరాబాద్‌ లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పౌరులకు రక్షణ కల్పించడంలో, పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి.