బాలయ్య, చిరంజీవి.. ‘మైత్రీ’ డబుల్ ధమాకా.!

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఇద్దరూ సంక్రాంతికే వస్తున్నారు తమ తమ సినిమాలతో. రెండు సినిమాల్నీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జనవరి 12న సినిమా విడుదల చేస్తున్నారు.

ఇక, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి వుంది. నేడో రేపో ఆ అనౌన్స్‌మెంట్ వచ్చేయనుంది.

కాగా, రిలీజ్ డేట్స్ విషయమై మైత్రీ సంస్థ మల్లగుల్లాలు పడింది. చివరికి చిరంజీవి, బాలయ్య.. ఇద్దరితో సంప్రదించి రిలీజ్ డేట్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి ప్రమోషన్స్ ఎలా.? చిరంజీవినీ, బాలయ్యనీ కలిపి ఓ ప్రమోషనల్ ఈవెంట్ చేస్తే ఎలా వుంటుంది.? అన్న కోణంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట.

ఈవెంట్ సంగతెలా వున్నా, బాలయ్య – చిరంజీవి కలిసే ఓ ఇంటర్వ్యూలో కనిపించబోతున్నారట. దీనికోసం ఇప్పటికే ఇద్దరి నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఆహా’ టీమ్ కూడా బాలయ్య – చిరంజీవిలను ఒకే వేదికపై చూపించడానికి కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.