SSMB28: మరీ 70 కోట్లు అంటే ఎలా వర్కౌట్ అవుతుంది మహేష్ ?

Mahesh

SSMB28: కొద్ది రోజుల క్రితమే మహేష్ – త్రివిక్రమ్ సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఈ సినిమానే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద చాలా గ్యాసిప్ లు పుట్టాయి. కానీ, వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ టీమ్ క్లారిటీ ఇస్తూనే వచ్చింది. ఐతే, ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్ పాయింట్ వచ్చి చేరింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ?, నిజానికి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఇంత.. అంత అంటూ రకరకాల ఫిగర్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి.

కానీ, వాటిల్లో వాస్తవం ఎంత ఉంది అని ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. మరోపక్క, తన తోటి స్టార్స్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్.. ఇలా అందరూ 50 కోట్లు నుంచి 55 కోట్ల రెమ్యూనరేషన్ మార్క్ ను టచ్ చేశారు. మరి ఈ లెక్కన మహేష్ రెమ్యూనరేషన్ మార్క్ ఎంత ఉంటుంది ?, మిగిలిన స్టార్ లు కంటే ఒక మెట్టు ఎక్కువనుకునే సూపర్ స్టార్ కూడా అంతకన్నా ఎక్కువే తీసుకుంటాడు. ఇంతకీ మహేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?, 60 కోట్లు అని పక్కాగా వినిపిస్తోంది. కాదు, 65 కోట్లు పైగానే అని కూడా టాక్ వినిపిస్తోంది.

అసలు ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ ఇంత అని ఏ ఫిగర్ బయటకు రాలేదు. ఐతే, గతంలో మహేష్ బాబు రెమ్యూనరేషన్ 45 కోట్లు నుంచి 55 కోట్లు మధ్యలో ఉండేది. కానీ, ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా నేషనల్ రేంజ్ సినిమా. అందుకే, మహేష్ ఈ సారి 70 కోట్ల కి కాస్త ఇటు అటుగా కోట్ చేసి తీసుకుంన్నాడని అంటున్నారు. ఇప్పుడు ఎలాగూ స్టార్ హీరోల రెమ్యూనిరేషన్లు బాగా పెరిగాయి.

అందువల్ల మహేష్ బాబు రెమ్యూనరేషన్ కూడా ఈజీగా 70 కోట్లు పైమాటే ఉంటుంది. ఒకవేళ ఇదే నిజం అయితే, ఇంతకీ మహేష్ – త్రివిక్రమ్ సినిమా బడ్జెట్ ఎంత ?, మహేష్ కే 70 కోట్లు ఇచ్చి, త్రివిక్రమ్ కు మరో 30 కోట్లు ఇచ్చి.. ఇవి కాకుండా మిగిలిన నటీనటులకు మరియు సాంకేతిక బృందానికి అలాగే ప్రొడక్షన్ కి… ఇవన్నీ కలుపుకుంటే.. మరో 140 నుంచి 150 కోట్లు దాటేస్తాయి. అంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ నే 250 కోట్లు దాటేలా ఉంది.

మరి ఈ రేంజ్ బడ్జెట్ పెడితే.. అసలు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా ?, అసలుకే పాన్ ఇండియా హిట్ అంటూ డప్పులు కొట్టుకున్న పుష్ప సినిమానే తెలుగులో బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ, పుష్ప హిందీలో బ్రేక్ ఈవెన్ అయింది. కాకపోతే.. పుష్ప పరిస్థితి రచ్చ గెలిచి ఇంట నెల నాకినట్లు అయింది. రాజమౌళి సినిమా కాకుండా ఇతర తెలుగు సినిమాల్లో పుష్ప నే టాప్. అలాంటి సినిమాకే అతీగతీ లేకపోతే.. మరీ మహేష్ సినిమా పరిస్థితి అంతేగా !! మరి పంచ్ మాస్టర్ త్రివిక్రమ్ లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి.