బిగ్ అప్డేట్ : “గేమ్ చేంజర్” ఎప్పుడో తెలిసిపోయింది.. 

రానున్న రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న పలు బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ చిత్రం “గేమ్ చేంజర్” సినిమా కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ మాసివ్ ప్రాజెక్టు కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా వారికీ చాలా సస్పెన్స్ గా నిలిచింది.

అయితే రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది గత కొన్నాళ్ల కితమే నిర్మాత దిల్ రాజు ఆఖరి నిర్ణయం శంకర్ గారిదే అని తేల్చి చెప్పేసాడు. కానీ తర్వాత మళ్ళీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ రిలీజ్ పై బిగ్ అప్డేట్ రివీల్ అయ్యిపోయింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ పై లేటెస్ట్ గా దిల్ రాజు మాసివ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని తాము వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. దీనితో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఈ సినిమా అప్డేట్ వచ్చేసింది అని చెప్పాలి. కాగా మెగా ఫ్యాన్స్ కి అయితే అప్పటివరకు ఎదురు చూపులు తప్పవని చెప్పాలి.

ఇక ఈ మాసివ్ చిత్రంలో కియారా అద్వానీ అలాగే అంజలి లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా దీనిని ప్రెస్టీజియస్ గా నిర్మాణం వహిస్తున్నారు.