బిగ్ న్యూస్ : లేటెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డుతో హిస్టరీ సెట్ చేయనున్న రాజమౌళి.!

ఇప్పుడు తెలుగు సినిమా మరియు ఇండియన్ సినిమాని అయితే వేరే లెవెల్లో ప్రెజెంట్ చేసిన దర్శకుడు మన టాలీవుడ్ దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పడంలో సందేహం లేదు. తన గత చిత్రాలు బాహుబలి రెండు సినిమాలు అనుకుంటే లేటెస్ట్ గా తీసిన తన భారీ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) దానిని మించి వరల్డ్ వైడ్ సెన్సేషన్ ని నమోదు చేశారు.

అయితే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ ఏ రేంజ్ లో ఆదరణ లభిస్తుంది అంటే ఇప్పుడు రాజమౌళి అందుకున్న ఇంటర్నేషనల్ లో అవార్డుతో ఆస్కార్ కి టికెట్ అందుకున్నట్టు ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది అని ఇంటర్నేషనల్ ప్రముఖులే చెప్తున్నారు.

మరి తాజాగా అయితే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ వారు రాజమౌళిని బెస్ట్ డైరెక్టర్ గా ప్రపోజ్ చెయ్యగా ఇందులో వీరు ఇప్పటివరకు 22 సార్లు చేసిన ప్రపోజల్స్ లో 16 మంది ఆస్కార్ కి ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది. దీనితో డెఫినెట్ గా రాజమౌళి కూడా ఆస్కార్ బరిలో నిలబడతారని ప్రముఖులు అంటున్నారు.

మరి దీనితో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళి పేరు మారుమోగుతోంది. అలాగే ఇది తెలుగు సినిమా సహా భారతీయ సినిమాకి గర్వకారణం అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు.