ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని కానీ తెలుగు సినిమా బార్ ని పెంచింది ఎవరైనా ఉన్నారు అంటే అది నిర్మొహమాటంగా దర్శకుడు రాజమౌళి అండ్ కో అనే చెప్పాలి. కాగా రాజమౌళి ఇంత ఫేమ్ అందుకున్నాడు అంటే అందుకు ప్రధాన బలం తన ప్రతి సినిమాకి కథ అందించే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనే చెప్పాలి.
మరి విజయేంద్ర ప్రసాద్ అందించిన ఒకో కథ కూడా రాజమౌళి తీసి వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే రాజమౌళి కెరీర్ స్టార్ట్ అయ్యింది ఎన్టీఆర్ తో అని తెలిసిందే. కానీ తర్వాత రామ్ చరణ్ తో సినిమాలు చేసిన నాటి నుంచి రాజమౌళి అసలు సత్తా ఏంటో అనేది తెలిసింది.
అక్కడ నుంచి రాజమౌళి కి కానీ విజయేంద్ర ప్రసాద్ కి కానీ చరణ్ తో మంచి బంధం అభిమానం ఏర్పడింది. ఎందుకో చరణ్ విషయంలో వారికి ప్రత్యేకమైన అభిమానం కూడా ఉందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఇదే కుల మీడియాకి మింగుడు పడడం లేదు.
విజయేంద్ర ప్రసాద్ పదే పదే రామ్ చరణ్ ని పొగడడం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని తగ్గిస్తున్నారు అని మాట్లాడ్డం వారికి నచ్చలేదు. దీనితో ఏకంగా రాజమౌళికే హితవు పలుకుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ ని కంట్రోల్ లో పెట్టాలని టార్గెట్ చేసి పెట్టడం వంటివి ఇప్పుడు చర్చకు దారి తీశాయి. దీనితో అసలు ఒకరు ఎలా ఉండాలి ఎలా మాట్లాడి అని చెప్పే హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంది అని నెటిజన్స్ ఆ కుల మీడియాపై విమర్శలు చేస్తున్నారు.