జస్ట్ మిస్..తెలంగాణాలో RRR దగ్గరకి వచ్చేసిన “సలార్” డే 1

ఈ ఏడాదికి చివరి నెల అయినటువంటి డిసెంబర్ లో వచ్చిన సినిమాలు అయితే చాలా వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అని చెప్పాలి. డిసెంబర్ 1న రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆనిమల్ తో బాక్సాఫీస్ బ్లాస్ట్ స్టార్ట్ కాగా ఇప్పుడు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ వరకు వచ్చింది.

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ చిత్రమే “సలార్” కాగా ఈ చిత్రాన్ని అయితే సెన్సేషనల్ హైప్ నడుమ నిన్ననే మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం రిలీజ్ డే నాడు తెలుగు రాష్ట్రాల్లో భారీ రికార్డులు సెట్ చేసింది. కాగా తెలంగాణ రీజయన్ లో అయితే సలార్ ఆల్ మోస్ట్ ఆర్ ఆర్ ఆర్ రికార్డుని కొట్టేసే దగ్గరకి వెళ్ళిపోయింది.

కేవలం లక్షలలో మాత్రమే గ్యాప్ ఉంది. కాగా తెలంగాణాలో ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం మొదటి రోజు భారీ మొత్తంలో 23.8 కోట్లకి పైగా షేర్ ని రాబడితే సలార్ మాత్రం ఏకంగా జస్ట్ ఒక్క రోజులోనే 22.5 కోట్లకి పైగా రాబట్టేసింది. దీనితో సలార్ పై ఉన్న హైప్ ఏ లెవెల్ లో టచ్ అయ్యిందో అర్ధం చేసుకోవాలి.

ఒక్క ఇద్దరు టాప్ హీరోస్ ఇంకా రాజమౌళి సినిమా కాగా ఇక్కడ ప్రభాస్ ఒక్కడు ప్రశాంత్ నీల్ సినిమా అయినా కూడా ఆల్ మోస్ట్ ఆర్ ఆర్ ఆర్ ని టచ్ చేసిన పని చేసింది. మొత్తానికి అయితే సలార్ ఈ సెన్సేషనల్ మార్క్ ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్ గా మారింది.