వైరల్ : “RRR” సైడ్ హీరో ఎవరో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్

RRR-1200by667

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ప్రైడ్ చిత్రాల జాబితా తీస్తే అందులో అన్ని సినిమాలు కూడా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి చిత్రాలే ఉంటే ఆ చిత్రాల్లో రీసెంట్ సెన్సేషన్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా తప్పకుండా ఉంటుంది. దానికి ముందు తాను తెరకెక్కించిన చిత్రం బాహుబలితో భారీ రికార్డులు సెట్ చేసిన జక్కన్న దీని తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బిగ్ స్టార్స్ ని పెట్టి ఒక ఊహించని మల్టీస్టారర్ ని తాను అనౌన్స్ చేసాడు.

కాగా ఇద్దరు పెద్ద ఫ్యామిలీ హీరోలు అంటే అక్కడ మెయిన్ హీరో ఎవరు అనేది అందరిలో ప్రశ్నగా మారుతుంది. కాగా ఇదే రిలీజ్ డేట్ వచ్చేవరకు కూడా ఆసక్తిగా మారగా ఎన్టీఆరే మెయిన్ హీరో అని ఫిక్స్ అయ్యిపోయిన ఫ్యాన్స్ కి థియేటర్స్ లో సినిమా చూసాక షాక్ తగిలింది. సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్ లా ఉన్నాడే అనేది స్టార్ట్ అయ్యి చాలానే రచ్చ జరిగింది.

ఇక రాజమౌళి సినిమా రచయితా విజయేంద్ర ప్రసాద్ లు కూడా రామ్ చరణ్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి మరింత ఒత్తిడి మొదలైంది. అక్కడ నుంచి ఎన్టీఆర్ పేరు మొదట వేయడం స్టార్ట్ చేశారు మేకర్స్. కాగా మీ హీరో సైడ్ హీరో అంటే మీ హీరో సైడ్ హీరో ఈ సినిమాలో అని ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ బాగా కొట్టుకుంటున్న ఈ టైంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన తాజా కామెంట్స్ మరింత వైరల్ అయ్యాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా కష్టమైంది అని తన పాత్ర చాలా సపోర్టింగ్ గా ఈ సినిమాలో ఉంటుంది అని తెలిపారు. అంతే ఇక మళ్ళీ మొదలైంది సినిమాలో సైడ్ హీరో అంటే సపోర్టింగ్ హీరో ఎన్టీఆర్ అని మళ్లీ ప్రూవ్ అయ్యింది అంటూ చరణ్ ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే ఈ చిత్రంలో మెయిన్ హీరో మాత్రం చరణ్ అనే చాలా మంది కూడా చెబుతారు.