వినోదయా సీతం.. బ్రో గా రీమేక్ అనుకున్నప్పుడు అసలు ఫ్యాన్స్ నుంచి ఏ మాత్రం పాజిటివ్ రియాక్షన్ అయితే రాలేదు. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక బ్రో సినిమా ప్రమోషన్ లో దర్శకుడు సముద్రఖని కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని గట్టిగానే హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ స్క్రిప్ట్ మొదట అనుకున్నప్పుడు త్రివిక్రమ్ కంటే ముందు మరొక రైటర్ ను అనుకున్నారు.
మొదట పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్.. ఇలా ఒక ప్లాన్ రెడీ చేసుకున్న తర్వాత డైలాగ్స్ కోసం ప్రముఖ టాలీవుడ్ స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రాను అనుకున్నారు. ఆయన తెలుగులో ఇంతకుముందు గౌతమీపుత్ర శాతకర్ణి, సైరా నరసింహారెడ్డి, RRR వంటి సినిమాలకు రైటర్ గా వర్క్ చేశారు. ఇక ఆయన అయితే ఈ సబ్జెక్టుకు బాగుంటుంది అని మొదట త్రివిక్రమే దర్శకుడికి సలహా ఇచ్చాడు.
అయితే తెలుగు వెర్షన్ మొత్తం ఆయన సిద్ధం చేసిన తర్వాత డైలాగ్స్ ఏవి కూడా త్రివిక్రమ్ కు అంతగా నచ్చలేదని అందుకే ఆయన స్క్రిప్టును రిజెక్ట్ చేసి మళ్లీ త్రివిక్రమ్ రంగంలోకి దిగి అంతా రెడీ చేశారు అని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే ఈ విషయంలో కూడా సముద్రఖని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
నా వరకు అయితే మొదట తెలుగులో సినిమా చేయాలి అనుకున్నప్పటి నుంచి ఆయన స్క్రిప్ట్ నా దగ్గర కూడా రాలేదు. మొదట ఆయన వర్క్ చేశారు కానీ.. మెయిన్ గా నేను త్రివిక్రమ్ గారు చెప్పిన స్క్రిప్ట్ విన్నాను.. ఆ తరువాత అందరం కూడా దాంతోనే ముందుకి వెళదాము అని ఫిక్స్ అయినట్లు సముద్రఖని అన్నారు. మొత్తంగా దాని గురించి పెద్దగా చర్చ లేకుండా సమాధానం తెలియజేశారు. ఏదేమైనా సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు మొదట వర్క్ చేసి ఆ తర్వాత తప్పుకున్నారు అనేది నిజమే అని తెలుస్తోంది.