ఆ సమయంలో భరించలేని నొప్పి వచ్చింది.. ఆవిషయం తలుచుకొని ఎమోషనల్ అయిన కాజల్!

తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కాజల్ అగర్వాల్.మొదటి సినిమాతోనే ఎంతో చూడ చక్కని అందం అమాయకత్వంతో అందరిని ఆకట్టుకున్న ఈమె అనంతరం చందమామ మగధీర వంటి సినిమాలతో వరస హిట్లు అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు సంపాదించుకున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న కాజల్ అగర్వాల్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

ఈ విధంగా దశాబ్దన్నర కాలం పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చారు.పెళ్లి తర్వాత కొద్ది నెలలకి ఈమె ప్రెగ్నెంట్ కావడంతో తాను కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకొని పూర్తిగా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ యేడాది ఏప్రిల్ 19 న కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు నీల్ అనే పేరు పెట్టారు.అయితే తాజాగా తన కుమారుడు జన్మించిన తర్వాత కాజల్ అగర్వాల్ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ కొన్ని అత్యవసర షూటింగుల నిమిత్తం తాను బయటకు వెళ్లాల్సి వచ్చిందని అయితే తన కుమారుడిని ఇంటిలో వదిలి షూటింగ్ కి వెళ్లాలంటే తనకు ఎంతో బాధ వేసిందని కానీ తప్పనిసరి పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చిందని ఈమె తెలిపారు.ఇలా బయటకు వెళ్లినా నిత్యం తన నీల్ గురించే తనకు ఆలోచనలు వస్తున్నాయని తనకు తల్లిగా సరైన సమయాన్ని తనతో గడపలేకపోతున్నాననే బాధ తనని వేధిస్తుందని ఈమె తెలిపారు. ఇలా తన కొడుకుతో సమయం గడపడం కోసమే తాను జిమ్ కి కూడా వెళ్లలేదని తెలిపారు.ఇకపోతే ప్రతి తల్లి తన బిడ్డకు పాలు పట్టించాలని కోరుకుంటుంది అయితే పాలు పట్టించే సమయంలో భరించలేని నొప్పి వస్తుంది. తాను కూడా తన కుమారుడికి పాలు పట్టించే సమయంలో భరించలేని నొప్పి అనుభవించానని అయితే ఆ నొప్పిని ప్రేమగా ఆస్వాదించానని ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.