సమాజంలోనైనా, కుటుంబంలోనైనా ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే బంధాలు, బంధుత్వాలు బలపడతాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అధికారాన్ని చాలా ఇచ్చుకుంటే ఆ బంధాలు ఎక్కువ రోజులు నిలవకపోగా పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. అలాంటి పొరపాట్లు చేస్తే మీ పెళ్లి బంధం ఎక్కువ రోజులు నిలవకపోగా,మీ పిల్లల భవిష్యత్తును మీ చేతులారా నాశనం చేసినట్లు అవుతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు గౌరవం
ఇచ్చిపుచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్నప్పుడే ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడి జీవితకాలం సుఖ సంతోషాలతో జీవించవచ్చు.
మానసిక నిపుణుల సూచనల ప్రకారం ఇటీవల కాలంలో ఎక్కువ మంది భర్తలు తమ భార్యలు తమకు గౌరవం ఇవ్వలేదని బాధపడే భర్తల కేసులే ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. అలాగే తమ పిల్లలు కూడా తండ్రి నన్న గౌరవాన్ని చూపించలేదంటూ బాధపడే తండ్రులు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు.సమాజంలో గౌరవం పొందాలంటే ముందు మీరు మీ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల చేత గౌరవించబడినప్పుడే అది సాధ్యమవుతుంది. మీ ఇంట్లో మీరు గౌరవం పొందాలంటే ముందు మీరు కొన్ని కర్తవ్యాలను తప్పనిసరిగా నెరవేర్చాలి.
ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే మీ భార్య అయినా మీ పిల్లలైనా మిమ్మల్ని గౌరవిస్తారు. అలా కాకుండా మీరు ఉద్యోగం చేయకుండా ఇంటి అవసరాలు పట్టించుకోకుండా జల్సాలుగా తిరిగే అలవాటు ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు గౌరవించరు.చివరికి మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని గౌరవించరునీ మానసిక నిపుణులు చెబుతున్నారు. మరి కొంతమందిని పరిశీలిస్తే ఇంటి బాధ్యతలు అన్ని నెరవేరుస్తూ భార్య పిల్లలను మంచిగా చూసుకున్నప్పటికీ కొంతమంది భార్యలు భర్తలకు గౌరవం ఇవ్వకపోగా హేళన చేస్తుంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు ఇలా చేస్తే మీ భర్త మానసికంగా కృంగిపోయి చెడు అలవాట్లకు బానిసయ్యే ప్రమాదం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.