Samantha: ఎట్టకేలకు డైరెక్టర్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత… త్వరలోనే గుడ్ న్యూస్?

Samantha: సినీనటి సమంత వ్యక్తిగత జీవితం అలాగే వృత్తిపరమైన జీవితం తెరిచిన పుస్తకమే. ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అదేవిధంగా సినీ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచి చివరికి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు..

ఇలా వీరి పెళ్లి జరిగినటువంటి మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోయారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట మూడు ముళ్ళు పడిన తర్వాత మూడేళ్లకే తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇలా సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న సమంత గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలను మాత్రం ఈమె ఖండించలేదు.

ఇటీవల కాలంలో సమంత ఎక్కడికి వెళ్ళినా డైరెక్టర్ రాజ్ తో కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు మరింత బలపడ్డాయి అయితే ప్రస్తుతం అమెరికా పర్యటనలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించారు అంతేకాకుండా సమంత భుజంపై రాజ్ చేతులు వేసుకొని కనిపించడంతో వీరు పీకల్లోకి ప్రేమలో మునిగి తేలుతున్నారని ఏ క్షణమైనా శుభవార్తను చెప్పవచ్చు అంటూ అభిమానులు వీరిద్దరి రిలేషన్ గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే డైరెక్టర్ రాజ్ ఇదివరకే పెళ్లి చేసుకొని తన భార్యకు విడాకులు ఇచ్చారని తెలుస్తోంది.