ఇంట్లో చీపురును ఎక్కడ ఏ విధంగా పెట్టాలో తెలుసా.. ఆ తప్పులు చేయొద్దంటూ?

కొన్నిసార్లు మనం చిన్నచిన్న విషయాలను పట్టించుకోకుండా తప్పు చేస్తూ ఉంటాం. అయితే ఆ చిన్నచిన్న తప్పులే తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. చీపురును ఇంట్లో ఇష్టానుసారం ఉంచితే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చీపురు విషయంలో శాస్త్రాన్ని ఫాలో అయితే బాగుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఈశాన్యం వైపు చెత్తను ఎప్పుడూ పోగు చేయకూడదు.

ఎవరైతే ఆ విధంగా చెత్తను పోగు చేస్తారో వాళ్ల ఇంట్లో సంపద నిలిచే అవకాశం ఉండదు. పూజగది, వంటగది, పడకగదిలో చీపురును ఎప్పుడూ ఉంచకూడదు. చీపురు, తుడుపు కర్ర విషయంలో వాస్తు నియమాలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. వాయువ్య, పశ్చిమ మూలలలో వీటిని ఉంచవచ్చు. పురాణాల ప్రకారం చీపురును మాతా లక్ష్మిగా భావించడం జరుగుతుంది. లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్లిన సమయంలో అక్కడ శుభ్రం చేయడానికి చీపురును ఉపయోగించింది.

చీపురును నిలువుగా, తలక్రిందులుగా కూడా ఉంచకూడదు. టెర్రస్, బాల్కనీ, బహిరంగ ప్రదేశాలలో చీపురును ఉంచడం కరెక్ట్ కాదు. విరిగిన, పాత చీపురులను వాడటం వల్ల కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. చీపుళ్లను వినియోగించడం వల్ల కూడా చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు.

ఇతరులు ఎవరైనా అడిగినా ఉపయోగించిన చీపురును అస్సలు ఇవ్వకూడదు. రెండు చీపుర్లను కలిపి ఉంచితే అశుభ ఫలితాలు వస్తాయి. చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం చీపురును రివర్స్ లో పెడితే మనపై శని ప్రభావం ఉండే అవకాశం ఉంది. శాస్త్రాన్ని నమ్మి పూజలు చేయడం వల్ల సులువుగా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.