నెలరోజుల పాటు ఉప్పు తినడానికి దూరంగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

మన వంటగదిలో ఉన్న ముఖ్యమైన వంటకాలలో ఉప్పు ఒకటనే సంగతి తెలిసిందే. ఉప్పు తినడం వల్ల వంటకాలు రుచిగా ఉండటంతో పాటు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. అయితే ఉప్పు పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఉప్పును మోతాదుకు మించి వాడితే నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే హైబీపీ సమస్యతో బాధ పడేవాళ్లు ఉప్పును మరింత పరిమితంగా తీసుకోవాలి.

మానవ శరీరం సరిగ్గా పనిచేయడానికి ఉప్పు అవసరం కాగా ఉప్పును ఎక్కువగా తిన్నా తక్కువగా తిన్నా ప్రాణాలకే అపాయం కలుగుతుంది. ఉప్పు తినడం వల్ల ద్రవ సమతుల్యత, నరాల ఆరోగ్యం, పోషకాల శోషణతో పాటు సరైన కండరాల పనితీరు ఉంటుందని చెప్పవచ్చు. ఒక వ్యక్తి నెలరోజుల పాటు ఉప్పుకు దూరంగా ఉంటే శరీరానికి కొన్ని లాభాలు కలగడంతో పాటు కొన్ని నష్టాలు చేకూరుతాయి.

రక్తంలో తక్కువ ఉప్పు స్థాయిలు ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఉప్పు తక్కువగా తీసుకుంటే కండరాల తిమ్మిరి, బలహీనత మరియు మైకము ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. తక్కువ సోడియం స్థాయిలు హైపోనట్రేమియాకు దారి తీసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ద్రవాల సమతుల్యతను కాపాడుకోవడంలో సోడియం పాత్ర ముఖ్యమైన పాత్ర అనే సంగతి తెలిసిందే.

ఉప్పు తక్కువగా తీసుకుంటే ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఉప్పు తక్కువగా తీసుకుంటే అయోడిన్ లోపం వేధించే అవకాశాలు ఉంటాయి. ఉప్పు తీసుకోకపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతిరోజూ ఐదు గ్రాముల ఉప్పును తీసుకోవాలి. రక్తపోటుతో బాధ పడేవాళ్లు ఎక్కువ మొత్తంలో ఉప్పును తీసుకుంటే అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సాధారణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఉప్పును పరిమితంగా తీసుకున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉండవు.