కంప్యూటర్, ల్యాప్ టాప్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలా వాడితే ఇన్ని సమస్యలా?

మనలో చాలామంది ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం కంప్యూటర్, ల్యాప్ టాప్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల కంప్యూటర్, ల్యాప్ టాప్ లను వాడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. కొంతమంది గేమ్స్ కోసం, ఇతర అవసరాల కోసం కంప్యూటర్, ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. బీటెక్ చదివే విద్యార్థులు సైతం ప్రాజెక్ట్ వర్క్స్, ఇతర అవసరాల కొరకు కంప్యూటర్, ల్యాప్ టాప్ లను ఎక్కువగా వినియోగించడం జరుగుతోంది.

అయితే కంప్యూటర్, ల్యాప్ టాప్ వాడేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కొన్ని తప్పులు చేస్తే మనం ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంప్యూటర్, ల్యాప్ టాప్ లను ఎక్కువ సమయం చూడటం వల్ల కంటిచూపుపై ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. ఒడిలో ల్యాప్ టాప్ లను ఉంచుకుని వాడటం వల్ల పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.

రోజంతా ల్యాప్ టాప్ లను వాడేవాళ్లు ల్యాప్ టాప్ నుంచి వెలువడే వేడి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలతో సైతం ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. పురుషులలో సంతానలేమి సమస్యలకు కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ కారణమవుతున్నాయి. ల్యాప్ టాప్ లను ఎక్కువగా వాడేవాళ్లను వంధత్వం సమస్య కూడా వేధిస్తోంది. ల్యాప్ టాప్ ల వల్ల కొన్ని సందర్భాల్లో స్పెర్మ్ నాణ్యత దెబ్బ తినే అవకాశం ఉంటుంది.

ల్యాప్ టాప్ ను నిత్యం ఉపయోగించే వాళ్లు ల్యాప్ టాప్ రేడియేషన్ వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ల్యాప్ టాప్స్ కండరాల నొప్పులకు సైతం కారణమవుతాయి. కంప్యూటర్, ల్యాప్ టాప్ లను తరచూ ఉపయోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.