మనలో చాలామంది ల్యాప్ టాప్ ను వాడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడటం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. గతంలో డెస్క్ టాప్ లను వినియోగించిన వాళ్లు ఇప్పుడు పనులు వేగంగా పూర్తి కావడానికి ల్యాప్ టాప్ లను ఉపయోగిస్తున్నారు. పోర్టబుల్ కంప్యూటర్లు రోజువారీ జీవితంలో అంతర్భాగం అయ్యాయనే సంగతి తెలిసిందే.
లాప్‌టాప్‌ను డైరెక్ట్‌గా శరీరానికి తాకించి వాడితే నెగిటివ్ ప్రభావం శరీరంపై పడుతుంది. ల్యాప్ టాప్ నుంచి వెలువడే ఈ.ఎం.ఎఫ్ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగే అవకాశం అయితే ఉంటుంది. లాప్‌టాప్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్‌లను అందుకుంటుందనే సంగతి తెలిసిందే.
ల్యాప్ టాప్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం పడే అవకాశంతో పాటు మహిళలలో అండాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. దీర్ఘకాలం ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల శరీరంపై హానికరమైన ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పని చేయడం ద్వారా మెడ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
లాప్‌టాప్ షీల్డ్‌ను ఉపయోగిస్తే రోగాల బారిన పడకుండా తప్పించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ల్యాప్ టాప్ లను తరచూ వినియోగించే వాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటింది. ల్యాప్ టాప్ ను వినియోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.